కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మూడు నెలలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎప్రిల్, మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరుకులు పంపిణి చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన బియ్యం, కందిపప్పుకు సంబంధించి రేషన్ డీలర్ల కు రూ. 36.36 కోట్ల కమిషన్ ను విడుదల చేసినట్లు తెలిపారు పౌరసరాఫరాల శాఖ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి.
రాబోయే రెండు రోజుల్లో జిల్లా మేనేజర్ కార్యాలయం నుంచి నేరుగా రేషన్ డీలర్ల ఖాతాలో జమకానున్నట్లు తెలిపారు. కిలో బియ్యానికి 70పైసలు, కిలో కందిపప్పుకు 55పైసల చొప్పున కమిషన్ చెల్లింపనట్లు ప్రకటించారు. ఏప్రిల్ నెలలో 3.18 లక్షలు, మే నెలలో 3.26 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.