జూడాలు విధుల్లో చేరండి: సీఎం కేసీఆర్

51
kcr cm

ప్రజారోగ్యం దృష్ట్యా జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలన్నారు సీఎం కేసీఆర్. జూడాల సమ్మె నేపథ్యంలో స్పందించిన సీఎం..జూడాల ప‌ట్ల ప్ర‌భుత్వం ఏనాడూ వివ‌క్ష చూప‌లేదు అని స్ప‌ష్టం చేశారు. న్యాయ‌మైన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు.

క‌రోనా విప‌త్క‌ర వేళ జూనియ‌ర్ డాక్ట‌ర్లు స‌మ్మెకు పిలుపునివ్వ‌డం స‌రికాదని… క‌రోనా వేళ స‌మ్మె నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లు హ‌ర్షించ‌రని తెలిపారు కేసీఆర్.
సీనియ‌ర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌర‌వ వేతం 15 శాతం పెంచాల‌ని నిర్ణ‌యించారు. మూడేళ్ల వైద్య విద్య‌తో కొవిడ్ విధుల్లో ఉన్న‌వారికి గౌర‌వ వేతనం పెంచాల‌ని నిర్ణ‌యించిన సీఎం….. సీనియ‌ర్ రెసిడెంట్ల‌కు ఇచ్చే గౌర‌వ వేత‌నం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. వైద్యుల స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.