తెలంగాణ మహిళామణులు వీరే..

227
Telangana government to honour 20 women
- Advertisement -

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. పలు రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలకు అవార్డులు అందజేస్తారు. అవార్డు గ్రహితలకు రూ.లక్ష నగదు, పురస్కారం అందజేస్తారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన 20 మంది ప్రముఖ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది.

విద్యా రంగంలో కవిత దరియాని,క్రీడారంగంలో అరుణా రెడ్డి, వైద్య రంగంలో డాక్టర్ సత్యలక్ష్మి,సాహిత్య రంగంలో చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ,డాక్టర్ సిరి,నృత్య రంగంలో మంజులా శ్రీనివాస్,సంగీతం రంగంలో నిత్య సంతోషిణికి అవార్డు ఇవ్వనున్నారు.

వీరితో పాటు చిత్రలేఖనంలో కవితా దేవుస్కర్,సినిమా రంగం నుంచి నందినీ రెడ్డి ,జానపద సంగీతంలో ఝాన్సీ,ఉద్యమ గానంలో ఈదునూరి పద్మ ,ఔత్సాహిక పారిశ్రామిక వేత్త – రాజ్యలక్ష్మి,జర్నలిజం -లతాజైన్, సౌమ్య నాగపురి,ప్రొఫెషనల్ సేవలు- సుప్రియ సనం,సరిత,మహిళా సాధికారత- యాప భద్రమ్మ,వ్యవసాయం – బొగ్గం జయమ్మ,ప్రజా ప్రాతినిథ్యం – శైలజ,సామాజిక సేవ – గండ్ర రమాదేవిలను అవార్డులతో సత్కరించనున్నారు.

- Advertisement -