తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య డేటా చోరి కేసు వార్ ముదురుతుంది. ఐటీ గ్రీడ్ కంపెనీ డైరెక్టర్ అశోక్ కోసం తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అశోక్ స్వయంగా వచ్చి లోంగిపోవాలని లేదంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తెలంగాణ పోలీసులు. తాజాగా డేటా చోరి కేసులో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్ కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌త్రివేది . వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్వ్రీంద్ర ఆధ్వర్యంలో ఈకేసును విచారించనున్నారు.
సిట్ బృందంలో సైబర్ క్రైమ్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, DSP రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్, సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీఎస్పీ బీ రవికుమార్‌రెడ్డి, మాదాపూర్ ఏసీపీ ఎన్ శ్యామ్‌ప్రసాద్‌రావు, సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ సీహెచ్ వై శ్రీనివాస్, హైదరాబాద్ సీసీఎస్ సైబర్‌క్రైమ్స్ ఇన్‌స్పెక్టర్లు బీ రమేశ్, జీ వెంకటరామిరెడ్డి లను నియమించింది. తెలంగాణ రాష్ట్ర డిజిపి కార్యాలయంలోనే సిట్ కు సంబంధించి ప్రత్యేక ఛాంబర్ ను కేటాయించింది.
హైదరాబాద్ లోని ఐటీ గ్రీడ్ సంస్ధలో ని కంప్యూటర్లు, సర్వర్ల నుంచి బయటకు తీసిన 80జీబీ డాటా గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నిన్న సైబరాబాద్ సైబర్ క్రైం బృందం ఢిల్లీకి వెళ్లింది. ఈకేసుతో సంబంధం ఉన్న గూగుల్ స్టోరేజి, అమెజాన్ వెబ్ సర్వీస్ కు మళ్లీ నోటిసులు పంపిచారు పోలీసులు. అంతేకాకుండా బ్లాఫ్రాగ్ , ఐటీ గ్రీడ్స్ సంస్ధలు ఏ పద్దతిన ప్రభుత్వ శాఖల డేటా సేకరణ కాంట్రాక్టు ఇచ్చారన్న కోణంలోనూ సిట్ దర్యాప్త సాగనుంది. ఈకేసు పూర్తయ్యే వరకు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.