ఇంటర్ పూర్తిచేసుకని.. ఇంజినీరింగ్‌లో చేరుదామనుకునే విద్యార్థులకు బోలెడు సందేహాలు. అందుకే విద్యార్థుల సందేహాలను తీర్చేందుకు టీ న్యూస్-అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌లు సంయుక్తంగా మర్రి లక్ష్మణ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ సమర్పణలో మళ్లీ వచ్చేసింది తెలంగాణ గొల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2017. శుక్రవారం రోజు ప్రారంభమైన ఈ ఫెయిర్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. మొదటిరోజు సుమారు పది వేల మందికి పైగా విధ్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రెండో రోజైన శనివారం కూడా భారీ సంఖ్యలో విధ్యార్థులు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. పిల్లలతో పాటు తల్లితండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గోంటూ తమ పిల్లల భవిష్యత్తు కోసం గైడెన్స్ తీసుకుంటున్నారు. విధ్యార్థులకు మరింత అవగాహాన కల్పించేందుకు తెలంగాణ ఎడ్యూకేషన్ ఫెయిర్‌లో పలువురు నిపుణులతో సెమినార్లు కూడా నిర్వహించడం జరుగుతోంది.
ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో ఎన్నో విద్యాసంస్థలు తమ కాలేజీల సమాచారం అందించనున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ కు ప్రవేశం ఉచితం. ఈ ఎడ్యుకేషనల్ ఫెయిర్‌లో ప్రధానంగా ఇంజనీరింగ్, మెడిసిన్‌తో పాటు ఇతర అన్ని కోర్సులు, కెరీర్స్ పై విద్యార్థులకు అవగాహన కల్ప. ఆయా రంగాలకు చెందిన అత్యంత నిష్ణాతులు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందిస్తారు. అంతేగాదు లక్కీ డ్రా ద్వారా విద్యార్ధులకు బహుమతులు కూడా అందించనున్నారు.
టీన్యూస్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తల్లితండ్రులు స్వాగతిస్తున్నారు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలో ఫెయిర్‌లో చక్కగా వివరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడో రోజైన నేడు తెలంగాణ గోల్డెన్ ఎడ్యూకేషన్ ఫెయిర్‌కు చివరి రోజు కావడం.. ఇంకా ఆదివారం సెలవుదినం కూడా కావడంతో ఎక్కవ సంఖ్యలో విధ్యార్థులు ఫెయిర్‌కు వస్తున్నారు. ఆదివారం ఫెయిర్ ముగింపు సంధర్బంగా భారీ నీటి పారుదల శాఖ మంత్రి హారిష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని విధ్యార్థులకు లక్కీ డ్రాలో గెలుచుకున్న బహుమతులను అందించనున్నారు.
ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు ప్లాటినమ్ స్పాన్సర్ మర్రి లక్ష్మణ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, డైమండ్ స్పాన్సర్ శ్రీ ఇందు గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్,గోల్డ్ స్పాన్సర్ శ్రేయాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ,పవర్డ్ బై విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్,సిల్వర్ స్పాన్సర్ బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్,కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్,నిషిత కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ,గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్,కో స్పాన్సర్స్- శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ,జేబీ ఎడ్యుకేషనల్ సొసైటీ,నారాయణ ఐఏఎస్ అకాడమీ,గిఫ్ట్ స్పాన్సర్స్ – భారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ. ఈ కార్యక్రమానికి వెబ్ మీడియా పార్ట్‌నర్ గ్రేట్ తెలంగాణ.కామ్,ప్రింట్ మీడియా పార్ట్ నర్ నమస్తే తెలంగాణ, నాలెడ్జ్ పార్ట్ నర్ వెలాసిటీ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్.