పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు..

45
summer holidays

తెలంగాణలో కరోనా దృష్ట్యా పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్‌ 15 వరకు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. డైట్‌ కళాశాలలకు కూడా జూన్‌ 15 వరకు సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణను పరిశీలించాలన్న మంత్రి కేటీఆర్‌ సూచనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. ఆన్‌లైన్‌ పద్దతిలో గ్రామీణ విద్యార్థులకు చేరువయ్యే మార్గాలు ఆన్వేషిస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి పరిష్కారం లభిస్తుందని మంత్రి సబిత చెప్పారు.