గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సతీమణి..

30
Dhurgam Jayatara

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో పచ్చదనం పెంచడం కోసం చైతన్యం తీసుకువస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సతీమణి జయతార మొక్కలు నాటారు. ఈరోజు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపుతూ మొక్కలను నాటడం జరిగింది. ఇందులో ఆమెతో పాటు వారి కూతురు నిహారిక,బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కొమ్మేర లక్ష్మణ్,నెల్లి రమేష్,టిఆర్ఎస్ టౌన్ యూత్ ప్రెసిడెంట్ సన్నీ బాబు పాల్గొన్నారు.