మంత్రి తలసానిని కలిసిన సినీ ఎగ్జిబిటర్లు..

123
minister talasani
- Advertisement -

తెలంగాణ సినిమా ఎగ్జిబిటర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు శనివారం మంత్రిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఏడాది కాలంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయని మంత్రికి వివరించారు. ఎగ్జిబిటర్స్‌, సినిమా థియేటర్ల నిర్వహకులు ఆర్థికంగా ఎంతో నష్టపోయారని ఈ కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు.

ముఖ్యంగా సినిమా థియేటర్లు మూసి ఉంచిన సమయానికి ప్రాపర్టీ ట్యాక్స్‌ మినహాయింపు ఇవ్వాలని, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో వాహనాల పార్కింగ్‌ చార్జి వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని, ఎస్‌జీఎస్టీను రద్దు చేయాలని, జీవో 75 ను పునరుద్దరించాలని, షూటింగ్‌ అనుమతి ఛార్జీలను తగ్గించాలని మంత్రికి వినతి పత్రాన్ని అందచేశారు. సునీల్‌ నారంగ్‌, అనుపమ్‌ రెడ్డి, అభిషేక్‌ నామా, సదానంద్‌ గౌడ్‌, బాల గోవింద్‌ రాజ్‌ తాడ్ల తదితరులతో పాటు తెలంగాణ ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్‌ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -