తెలంగాణలో థియేటర్లు ఓపెన్‌..

130

తెలంగాణ రాష్ట్రంలో గ‌త కొద్ది నెల‌లుగా మూత‌బ‌డ్డ సినిమా థియేట‌ర్లు ఆదివారం నుండి తెరుచుకోనున్నాయి. ఈ నెల 23వ తేదీ నుంచి కొత్త సినిమాలు విడుద‌ల కానున్న నేప‌థ్యంలో రేప‌టి నుంచి థియేట‌ర్ల‌ను తెర‌వాల‌ని తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ ప్రెసిడెంట్ ముర‌ళీమోహ‌న్, సెక్ర‌ట‌రీ సునీల్ నారంగ్.. ఎగ్జిబిట‌ర్ల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసి థియేట‌ర్ల ఓపెన్‌పై నిర్ణ‌యం తీసుకున్నారు. సినిమా థియేట‌ర్ల‌లో ప‌ని చేసే సిబ్బంది ఇబ్బందుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నామ‌ని ఫిల్మ్ ఛాంబ‌ర్ ప్ర‌తినిధులు తెలిపారు.

ఇక వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవనున్నాయి. కాగా, కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా దేశ వ్యాప్తంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. చాలా వరకు సినిమాలు ఓటీటీని ఆశ్రయించాయి. అయితే కొన్ని పెద్ద సినిమాలు థియేటర్‌ రిలీజ్‌కోసం వేచి ఉన్నాయి. క్యూలో ఉన్న సినిమాలన్నీ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.