కోవిడ్ నిబందనలు బేఖాతరు..రిజైన్‌ స్కై బార్ సీజ్‌

159
bar
- Advertisement -

కోవిడ్ నిబంధనలను బేఖాతరు చేసినందుకు రిజైన్ స్కై బార్ సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బార్లో పనిచేసే వెయిటర్లు మాస్క్ లు ధరించలేదని అధికారులు గుర్తించారు. దీనికి తోడు బార్ కౌంటర్ దగ్గర పరిమితికి మించి జనం గుమిగూడారని నిర్ధారణ కావడంతో బార్‌ని సీజ్ చేశారు.

రిజైన్ స్కై బార్‌లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వీడియో చేరడంతో ఎక్సైజ్ శాఖకు పంపి దర్యాప్తునకు ఆదేశించారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
.

కస్టమర్లు, సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టే విధంగా యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని అభియోగం నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 31 (1), 41,ఏపీ ఎక్సయిజ్ రూల్స్ 2005 లోని రూల్ 33, 38 ప్రకారం బార్ యాజమాన్యంపై కేస్ నెంబర్ 36/2020 నమోదు చేసింది ఎక్సైజ్ శాఖ.

- Advertisement -