ప్రభుత్వం ప్రకటించిన 30 రోజుల ప్రణాళికలో ఉద్యోగులందరూ 30 రోజుల పాటు శ్రమపడి ప్రభుత్వ పథకాలను విజయవతం చేసినందుకు సీఎం కేసీఆర్ ఉద్యోగులను అభినందించారు. గురువారం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు కారం రవీందర్, సెక్రటరీ జనరల్ మమత, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మామిళ్లరాజేందర్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, జ్ఞానేశ్వర్ , తెలంగాణ గెజిటేడ్ అధికారుల సంఘం ఛైర్మన్, మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.
30 రోజుల ప్రణాళిక విజయవంతంగా ముగిసిన సందర్భంలో ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 30 రోజులపాటు ఉద్యోగులందరు శ్రమపడి ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు ముఖ్యమంత్రి ఉద్యోగులను అభినందించారు. అక్టోబర్ 21 తర్వాత ఎన్నికల కోడ్ ముగియగానే ఉద్యోగ సంఘాల నాయకులను పిలిపించుకొని సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.