విద్యుత్‌ శాఖలో 1601పోస్టులు

61
- Advertisement -

తెలంగాణలోని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ ప్రకటించింది. 1601ఉద్యోగుల భర్తీకి నోటికిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 1553జూనియర్ లైన్‌మెన్‌ 48 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆ సంస్థ గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ ఈ నెల 15 లేదా ఆ తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. అభ్యర్థులను రాతపరీక్ష నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేయనున్నారు. గతేడాదిలో విడుదల చేసిన 1000జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించినప్పటికీ…కొందరు వ్యక్తులు ఈ పరీక్షలో అవకతవకలకు పాల్పిడినట్టు ఆరోపణలు రావడంతో నియామక ప్రక్రియను రద్దు చేశారు.

  • జూనియర్ లైన్ మెన్‌ ఉద్యోగార్ధులు పదో తరగతితో పాటు ఐటీఐ లేదా ఇంటర్ (ఒకేషనల్ కోర్సు ఎలక్ట్రికల్‌) ట్రేడ్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి 18 నుంచి 35యేళ్లు వేతన శ్రేణి రూ.24,340-39,405గా నిర్ణయించారు.

  • అసిస్టెంట్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలకైతే ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌ ఉండాలి.

వయోపరిమితి 18 నుంచి 44 యేళ్లు వేతన శ్రేణి రూ.64,295-99,345గా నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి…

ఉపాధిని పథకంను నీరుగార్చారు…

అద్బుతమైన చికెన్ ఫ్రై.. ఇలా చేయండి!

వాల్ నాట్స్ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

- Advertisement -