- Advertisement -
తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. కరోనా కారణంగా ప్రవేశ పరీక్షల నిర్వహణ ఆలస్యం కాగా తాజాగా కొత్త షెడ్యూల్‌ని విడుదల చేసింది ఉన్నత విద్యా మండలి. కరోనా నిబంధనల ప్రకారం పరీక్షలు జరగనున్నాయి.
సెప్టెంబర్ 28,29 తేదీల్లో ఎంసెట్ పరీక్ష జరగనుండగా ఆగస్టు 31న టీఎస్ ఈసెట్ పరీక్ష జరుగనుంది. సెప్టెంబర్ 9 నుంచి 14 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు పీజీ ఈసెట్, సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న టీఎస్ ఐసెట్, అక్టోబర్ 1 నుంచి 3 వరకు ఎడ్‌సెట్, అక్టోబర్ 4న లాసెట్ ప్రవేశపరీక్షలు నిర్వహించనున్నారు.
- Advertisement -