ఐపీఎల్‌ 2020…ఈ రెండు దేశాల ఆటగాళ్లకు లైన్‌క్లియర్‌!

242
ipl 2020

సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ ప్రాంఛైజీల ఆటగాళ్లు యుఏఈకి చేరుకోగా తాజాగా ఆసీస్, ఇంగ్లాండ్ క్రికెటర్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

విదేశీ ఆటగాళ్ల కోసం ఐపీఎల్ బయో బబుల్ ప్రోటోకాల్‌లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. దీంతో క్వారంటైన్‌ అవసరం లేకుండానే మొదటి మ్యాచ్ నుండే ఇంగ్లాండ్-ఆసీస్ క్రికెటర్లు పాల్గొననున్నారు.

ఐపీఎల్‌ ఆరంభానికి ముందు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లు సిరీస్‌లో తలపడనున్నాయి. దీంతో ఇరు జట్లలోని కొంతమంది ఆటగాళ్లు మొదటిదశ మ్యాచ్‌లకు దూరం కావాల్సిరాగా తాజాగా బీసీసీఐ తీసుకొచ్చిన మార్పులతో వీరికి లైన్ క్లియర్‌ అయింది.

రాజస్థాన్‌ టీమ్‌కు స్టీవ్‌ స్మిత్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. రాజస్ధాన్‌ టీమ్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన జోస్‌ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.