TS Eamcet:బాలికలే టాప్

13
- Advertisement -

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు రిలీజయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయగా ఈసారి ఫలితాల్లో బాలికలే అత్యధికమంత్రి ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 86 శాతం మంది అర్హత సాధించారని సబిత వివరించారు. ఇంజనీరింగ్ విభాగంలో 80 శాతం మంది అర్హత సాధించారని చెప్పారు. ఇంజనీరింగ్ విభాగంలో బాలికల ఉత్తీర్ణత శాతం 82గా నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 79గా నమోదైంది.అగ్నికల్చర్ విభాగంలో బాలికల ఉత్తీర్ణత శాతం 87గా నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 84గా నమోదైంది.

మే 10 నుంచి 14 వరకు ఎంసెట్‌ నిర్వహించారు. ఎంసెట్ కు దాదాపు 3 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలను 1,95,275, అగ్రికల్చర్‌ పరీక్షలను 1,06,514 మంది విద్యార్థులు రాశారు.జూలైలోపు ఎంసెట్ మూడు దశల కౌన్సెలింగ్‌ పూర్తి కానుండగా ఆగస్టు 1నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.

Also Read:ఈటెల అసంతృప్తి.. హైకమాండ్ కు నష్టమే !

ఎంసెట్‌ ఫలితాలను eamcet.tsche.ac.inలో చూసుకోవచ్చు. పరీక్షలు సజావుగా జరిగి, ఫలితాలు త్వరగా వెల్లడి కావడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు మంత్రి సబితా.

Also Read:ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినోత్సవం..

- Advertisement -