జూలై 1న టీఎస్ ఈసెట్..

297
ecet
- Advertisement -

టీఎస్‌ ఈసెట్‌-2021 పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 17న నోటిఫికేషన్‌ విడుదల కానుండగా జులై 1న పరీక్ష నిర్వహించనున్నారు. ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ స్ట్రీమ్‌లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అదే సీఐవీ, సీహెచ్‌ఈఎం, ఎంఈసీ, ఎంఐఎన్‌, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం విభాగాలకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహణ జరగనుంది.

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 22వ తేదీ నుండి మే 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 ఆలస్య రుసుంతో మే 31వ తేదీ వరకు, రూ.500 అపరాద రుసుంతో జూన్‌ 14 వరకు, రూ.2,500 అపరాద రుసుంతో జూన్‌ 24వ వరకు అదే రూ. 5 వేల అపరాద రుసుంతో జూన్‌ 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 400 కాగా ఇతర అభ్యర్థులకు రూ.800.

రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరపున జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(జేఎన్‌టీయూహెచ్‌) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్షను నిర్వహించడం జేఎన్‌టీయూహెచ్‌కి ఇది ఏడోసారి.

- Advertisement -