లండన్‌లో “తెలంగాణ డే” వేడుకలు

23
- Advertisement -

లండన్ లోని భారత హైకమిషన్ ఆధ్వర్యంలో మొట్ట మొదటి సారి “తెలంగాణ డే” వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్ని సెంట్రల్ లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో నిర్వహించారు, ఇందులో యూకేలోని వివిధ ప్రవాస తెలంగాణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో ముందుగా లండన్ లోని భారత హైకమీష్నర్ విక్రమ్ దొరైస్వామి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ప్రవాసులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపి, ప్రవాసుల్లో ఐక్యత మరియు విదేశీ గడ్డ పై భారత సంస్కృతిని ప్రచారం చెయ్యడానికి వివిధ రాష్ట్రాల ఆవిర్భావ వేడుకల్ని భారత హైకమిషన్ అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) సంస్థ ప్రతినిధులు ఎంతో చుర్రుగ్గా పాల్గొనడమే కాకుండా తెలంగాణ సంస్కృతి ప్రతిభింబించేలా ప్రత్యేక నృత్య ప్రదర్శన మరియు హాజరైన అతిధులకు టాక్ ఆద్వర్యం లో హైదరాబాద్ బిర్యానీ ని రుచి చూపించారు.భారత హైకమీష్నర్ విక్రమ్ దొరైస్వామి టాక్ సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిస్తూ …టాక్ సంస్థ ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొనడమే కాకుండా అటు సాంస్కృతిక కార్యక్రమాలల్లో మరియు అతిధులకు బిర్యానీ తో అసలైన తెలంగాణ సంప్రదాయాన్ని చూపించారని తెలిపారు.

టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ లండన్ లోని భారత హైకమిషన్ ఆధ్వర్యంలో మొట్ట మొదటి సారి జరుగుతున్న “తెలంగాణ డే” వేడుకల్లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని, నాడు టాక్ వ్యవస్థాపకుడు , తెలంగాణ ఉద్యమ నాయకుడు అనిల్ కూర్మాచలం నాయకత్వంలో ఇదే భారత హైకమిషన్ ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆకాంక్షిస్తూ కెసిఆర్ గారి పిలుపు మేరకు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశామని, మరి నేడు అదే భారత హైకమిషన్ కార్యాలయంలో అధికారికంగా తెలంగాణకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని తెలిపారు.

ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేసిన భారత హైకమిషన్ కార్యాలయానికి అధికారులకు, మరియు హాజరై సహకరించిన టాక్ సభ్యులకు రత్నాకర్ కృతఙతలు తెలిపారు.టాక్ సంస్థ సీనియర్ నాయకుడు గణేష్ కుప్పలా మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేకతను వివరిస్తూ, తెలంగాణ చేనేత గొప్పతనాన్ని, టాక్ సంస్థ నేత కార్మికుల్ని ఆదుకోవడం కోసం చేస్తున్న కృషిని వివరించారు. అలాగే చేనేతను ధరించిన టాక్ ప్రతినిధులను గణేష్ వేదిక మీదికి పిలిచి అతిథులకు పరిచయం చేసి , చేనేత వస్త్రాల వివరాలని తెలిపారు.

టాక్ సంస్థ సభ్యులు స్వాతి, సుప్రజ, స్నేహ, కుమారి తన్మయ మరియు విద్య చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ వేడుకల్లో టాక్ సంస్థ ప్రతినిధులు రత్నాకర్ కడుదుల, గణేష్ కుప్పలా, నవీన్ రెడ్డి, హరి నవాపేట్, పవిత్ర, సురేష్ బుడగం, సుప్రజ పులుసు, స్వాతి, స్నేహ, విద్య, రావుల పృథ్వీ, కార్తీక్, నిఖిల్, కార్తీక్, నవ్య జ్యోతి, దివ్య, శ్రీకాంత్ ,కుమారి తన్మయ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Also Read:అమల్లోకి కొత్త న్యాయ చట్టాలు..

- Advertisement -