కొత్త రికార్డును సృష్టించిన తెలంగాణ!

251
cm kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో అరుదైన చరిత్ర ఆవిష్కృతం కాబోతున్నది. ఈ వానాకాలం చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. కొత్త ప్రాజెక్టులు కూడా అందుబాటులోకి రావడంతో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక ఆయకట్టుకు సాగునీరు అందబోతున్నది. ప్రస్తుతం కృష్ణ, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులు, వాటిలో ఉన్న నీటి నిల్వలు, ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాలను అంచనా వేస్తే… ఈ విషయం అర్థమవుతున్నది.

భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుత వానా కాలంలో ఏకంగా 41 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఎప్పుడూ ఆయకట్టుకు నీటిని సరఫరా చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో గరిష్ఠంగా 23 లక్షల ఎకరాలకే నీటిని అందించారు. సాధారణంగా ప్రతీ ఏడాది నీటి లభ్యతను బట్టి 10-20 లక్షల ఎకరాలకు మాత్రమే నీటిని సరఫరా చేస్తూ వచ్చారు.

వానాకాలం, యాసంగి రెండు సీజన్‌లలో కలిపి కూడా 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని ఇచ్చిన సందర్భం లేదు. అయితే ప్రస్తుతం ఒక్క వానాకాలంలోనే 41 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని నిర్ణయించడం కేసీఆర్ గత ఆరేండ్ల పరిపాలన విజయంగా నిలుస్తోంది.

శ్రీరాంసాగర్‌ మొదటి, రెండవ దశ మొత్తం ఆయకట్టుకు గతంలో ఎప్పుడూ నీటిని సరఫరా చేయలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిధిలోని 9.68 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు.శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును నిర్మించి నాలుగు దశాబ్దాలు దాటినా ఒక్క వానాకాలం పంటకు పూర్తి ఆయకట్టుకు సాగునీటిని అందించడం ఇదే తొలిసారి కానుంది.

శ్రీరాంసాగర్‌ మొదటి, రెండవ దశ మొత్తం ఆయకట్టుకు గతంలో ఎప్పుడూ నీటిని సరఫరా చేయలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిధిలోని 9.68 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును నిర్మించి నాలుగు దశాబ్దాలు దాటినా ఒక్క వానాకాలం పంటకు పూర్తి ఆయకట్టుకు సాగునీటిని అందించడం ఇదే తొలిసారి కానుంది.

తెలంగాణ వచ్చినంక కేసీఆర్ పట్టుదలతో గోదావరి నది మీద వడివడిగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుండి అనేక జిల్లాలకు ఈ ఏడాది దండిగా నీరు అందనుంది. దీనికి తోడు పాలమూరు జిల్లాలో కృష్ణా నది మీద తెలంగాణ వచ్చినంక పూర్తిచేసిన ఎత్తిపోతలు కూడా భారీగా నీటిని అందించనున్నాయి.2014-15 సంవత్సరంలో తెలంగాణలో వానాకాలం పంటకు కేవలం 9,73,072 ఎకరాలకు నీరు అందితే, నేడు అది 41,00,000 ఎకరాలకు చేరుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ఎట్లా పచ్చబడ్డదో నిలువెత్తు నిదర్శనం.

- Advertisement -