మెహర్ రమేష్‌కి మెగా ఆఫర్..!

284
mehar ramesh
- Advertisement -

మెహర్ రమేష్‌కి మెగా ఆఫర్ దొరికినట్లు టీ టౌన్ వర్గాల సమాచారం. ఎన్టీఆర్‌తో శక్తి సినిమా తర్వాత టాలీవుడ్‌కు దూరమైన మెహర్ రమేష్‌కి చాలాకాలం తర్వాత బంపర్ ఆఫర్ దొరికింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చారట మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్.

ఈ సినిమా క‌నుక కథ ఫైనల్ అయితే చిరు సినిమాకి డైరెక్ట్ చేసే అవకాశం ద‌క్కుతుందని ఫిలిం న‌గ‌ర్ టాక్. మరి మెహర్‌…రామ్ చరణ్‌ తనకు ఇచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

ప్రస్తుతం చిరంజీవి …కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు.ఈ మూవీ తర్వాత మలయాళ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్‌ చేయనుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుజీత్ తెరకెక్కించనున్నారు.

- Advertisement -