ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ సీనియర్ నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు కేంద్ర పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారితో కేటీఆర్ ఈ సందర్భంగా వారితో కేటీఆర్ మాట్లాడారు. 10 సంవత్సరాల కాలంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామని, అందుకే ప్రజలు ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చినా, మన పార్టీకి గౌరవప్రదమైన స్థానాలను కట్టబెట్టారన్నారు. ప్రజలు మనకు అందించిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామన్నారు.
ఎన్నికల తర్వాత ప్రజల నుంచి మన పార్టీ నాయకత్వం పైన ఒక సానుకూలను స్పందన వస్తున్నదని, మన పార్టీ అధికారం కోల్పోతుందని అనుకోలేదన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు కార్పరేషన్ల చైర్మన్లు.
తెలంగాణ పునర్నిర్మాణం లో మాకు అవకాశం కల్పించిన కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి బీ ఆర్ ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ,బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల కనుగుణంగా పని చేస్తాం అన్నారు. కార్పొరేషన్ల చైర్మన్లు డా .దూది మెట్ల బాలరాజ్ యాదవ్ రవీందర్ సింగ్ ,డా .వాసుదేవ రెడ్డి ,మన్నే క్రిశాంక్ ,గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,పల్లె రవికుమార్ గౌడ్ ,పాటి మీద జగన్ మోహన్ రావు ,అనిల్ కూర్మాచలం ,గజ్జెల నగేష్ ,మేడె రాజీవ్ సాగర్ ,డా .ఆంజనేయులు గౌడ్ ,సతీష్ రెడ్డి ,రామచంద్ర నాయక్ ,గూడూరి ప్రవీణ్ ,వాల్యా నాయక్ తదితరులు రాజీ నామా చేశారు.
Also Read:పవన్ సినిమాలో పల్లవి ప్రశాంత్ ?