రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 81.42 శాతం

113
corona

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24గంటల్లో 2,173 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 8 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,79,246కు చేరింది.

కరోనాతో ఇప్పటివరకు 1070 మంది మృతిచెందగా ప్రస్తుతం రాష్ట్రంలో 30,037 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 1,48,139 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే గ్రేటర్ పరిధిలో 308, రంగారెడ్డిలో 168, మేడ్చల్‌ 151, నల్గొండలో 136, కరీంనగర్‌లో 120, సిద్దిపేటలో 95, భద్రాద్తి కొత్తగూడెంలో 88, ఖమ్మంలో 86, సూర్యపేటలో 82 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 81.42 శాతంగా ఉండగా మరణాల రేటు 0.59శాతం ఉంది. 24 గంటల్లో 55,318 టెస్టులు చేయగా ఇప్పటివరకు 26,84,215 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.