తగ్గిన బంగారం,వెండి ధరలు

200
Gold Rate Today Live

పసిడి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి శుభవార్త. బంగారం,వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.760 తగ్గి రూ.52,470కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 తగ్గి రూ.48,100కు చేరింది.

ఇక కేజీ వెండి ధర ఏకంగా రూ.1600 తగ్గి రూ.59,000కు చేరాయి. వెండి ధర వరుసగా మూడోరోజు తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.36 శాతం తగ్గి 1861 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 2.96 శాతం తగ్గుదలతో 22.43 డాలర్లకు చేరింది.