24 గంటల్లో 2,579 కరోనా కేసులు…

145
corona

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు లక్షా 8 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,579 కరోనా పాజిటివ్‌కేసులు నమోదుకాగా 9 మంది మృతిచెందారు.

దీంతో ఇస్సటివరకు రాష్ట్రంలో 1,08,670 పాజిటివ్ ‌కేసులు నమోదుకాగా 770 మంది మృతిచెందారు. ప్రస్తుతం 23,737 యాక్టివ్ కేసులుండగా 84,163 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 10, 21,054 మందికి కరోనా టెస్టులు చేయగా నిన్న ఒక్కరోజే 52,933 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే జీహెచ్‌ఎంసీ పరిధిలో 295, రంగారెడ్డి జిల్లాలో 186, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో 106 కరోనా పాజిటివ్ ‌కేసులు నమోదైనట్లు వివరించింది. భద్రాద్రి కొత్తగూడెంలో 83, ఖమ్మంలో 161, వరంగల్ ‌అర్బన్‌ జిల్లాలో 143, వరంగల్ ‌గ్రామీణ జిల్లాలో 31, ఆదిలాబాద్ ‌జిల్లాలో 34, జగిత్యాల జిల్లాలో 98, జనగామా జిల్లాలో 46 కరీంనగర్ ‌జిల్లాలో 116, కామారెడ్డి జిల్లాలో 64, భూపాలపల్లి జిల్లాలో 12, జగిత్యాల జిల్లాలో 98, ఆదిలాబాద్ ‌జిల్లాలో 34 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.