32 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

184
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 60 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 32 లక్షలు దాటాయి.

గత 24 గంటల్లో 60,975 కరోనా కేసులు నమోదవగా 848 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 31,67,324 పాజిటివ్ కేసులు నమోదుకాగా 58,390 మంది మృతిచెందారు.

ప్రస్తుతం దేశంలో 7,04,348 యాక్టివ్ కేసులు ఉండగా 24,04,585 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 9,25,383 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 3,68,27,520 టెస్టులు చేశామని తెలిపింది ఐసీఎంఆర్.