తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 1,764 పాజిటివ్ కేసులు నమోదుకాగా 12 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటవరకు తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,906కు చేరాయి.
ప్రస్తుతంతెలంగాణలో 14,663 యాక్టివ్ కేసులు ఉండగా 43,751 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు కరోనాతో 492 మంది మృతిచెందారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 64 శాతంగా ఉండగా 33 జిల్లాలకు వైరస్ విస్తరించింది.
జీహెచ్ఎంసీలో 509 కేసులు నమోదు కాగా మేడ్చల్‌లో 158, రంగారెడ్డి జిల్లాలో 147, వరంగల్ అర్బన్‌లో 138, సంగారెడ్డి జిల్లాలో 89 కేసులు ఇవాళ అత్యధికంగా నమోదు అయ్యాయి.
ఇక రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా బారీన పడ్డారు. ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.