3020కి చేరిన కరోనా కేసులు..

315
coronavirus cases
- Advertisement -

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి 3020కి చేరాయి. బుధవారం కొత్తగా 129 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇప్పటివరకు 99 మంది మృతిచెందారు. 1,556 మంది కరోనా నుండి కొలుకుని డిశ్చార్జి కాగా 1,365 మంది చికిత్స పొందుతున్నారు.

బుధవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 108 కేసులు నమోదుకాగా, రంగారెడ్డి 6, ఆసిఫాబాద్‌ 6, మేడ్చల్‌ 2, సిరిసిల్ల 2, యాదాద్రి భువనగిరి 1, కామారెడ్డి 1, మహబూబ్‌నగర్‌ 1 చొప్పున వెలుగుచూశాయి.

హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన ముగ్గురు జర్నలిస్టులకు రూ.20 వేల చొప్పున ఆర్థికసాయాన్ని అందజేశారు మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ . ఇప్పటివరకు ఢిల్లీ, జోగుళాంబ గద్వాల, హైదరాబాద్‌లలో వైరస్‌ నిర్ధారణ అయిన 10 మంది జర్నలిస్టులకు రూ.20 వేల చొప్పున, క్వారంటైన్‌లో ఉంటున్న 11 మందికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.3.10 లక్షలు మీడియా అకాడమీ నిధుల నుంచి అందజేశామని చెప్పారు.

- Advertisement -