రామగుండం రీజియన్ 1లో బ్లాస్టింగ్ లో మృతి చెందిన కాంట్రాక్టు కార్మిక కుటుంబాలకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ప్రమాదం జరిగిన విషయం తెలసుకున్న వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రెండు రోజులుగా స్థానిక సింగరేణి ఆసుపత్రి వద్దనే ఎమ్మెల్యే ఉంటు కార్మికుల కుటుంబాలను ఓదార్చారు.
జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, కార్మిక సంఘాలతో కలసి పలుమార్లు యాజమాన్యంతో చర్చలు జరిపి సఫలమయ్యారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కోక్కరికి 40 లక్షల పరిహారంతో పాటు ఉద్యోగం ఇచ్చేలా సింగరేణి యాజమాన్యాన్ని, సదరు కాంట్రాక్టర్‌ను ఓప్పించి కార్మిక కుటంబాలకు నాయ్యం జరిగేలా కృషి చేశారు. కాంట్రాక్టు కార్మికుల ఎల్లవేలల అండగా ఉంటామని, కార్మికుల హక్కుల సాధనతో పాటు వారి నాయ్యం జరిగేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు.

ఓసిపి 1లో బాస్టింగ్ లో నలుగరు కాంట్రాక్టు కార్మికులు మృతి చెందడం విచారకరమని అన్నారు. కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు తాము అన్ని విధాలుగా అదుకుంటామని తెలిపారు. రాబోవు రోజులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సదరు యాజమాన్యలు రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. ఎమ్మెల్యే నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెళ్ళి అభిషేక్
రావు, టిబిజికెఎస్ అధ్యక్షులు వెంకట్రావు, నాయకులు మిర్యాల రాజిరెడ్డి, అంతర్గాం జడ్పీటిసి ఆముల నారాయణతో పాటు పలు కార్మిక సంఘాల నాయకులున్నారు.


