24 గంటల్లో 1850 కరోనా కేసులు..

1228
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి రికార్డు స్ధాయిలో పెరిగిపోతూనే ఉన్నాయి. శనివారం 1850 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్ల వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1572 కేసులు నమోదుకావడం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.

ఇక తెలంగాణలో ఇప్పటివరకు 22312 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇప్పటివరకు 288 మంది మృత్యువాతపడ్డారు. ఇక ఇవాళ 6427 కరోనా శాంపిల్స్ టెస్టు చేయగా 4577 మందికి నెగటివ్ రిపోర్టు వచ్చాయి. ఇక ఇప్పటివరకు తెలంగాణలో 1,10,545 కరోనా టెస్టులు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 10487 యాక్టివ్ కేసులు ఉండగా 11537 మంది కరోనా నుండి కొలుకోని డిశ్చార్జ్ అయ్యారు.

భువ‌న‌గిరి డీసీసీబీ చైర్మ‌న్ గొంగిడి మ‌హేంద‌ర్ రెడ్డికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రెండు రోజుల క్రితం.. ఆయ‌న జ్వ‌రంతో బాధ‌ప‌డ్డారు. దీంతో చైర్మ‌న్ న‌మూనాల‌ను సేక‌రించి కొవిడ్ ప‌రీక్ష‌ల‌కు పంపారు. ప‌రీక్ష‌ల అనంత‌రం మ‌హేంద‌ర్ రెడ్డికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు వైద్యులు తెలిపారు.ఆయన భార్య ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత‌కు ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -