భారత్‌లో కనిపించని చంద్రగ్రహణం…

50
lunar ecilipse

ఖగోళంలో అద్భుతం చోటుచేసుకుంది. అదే చంద్రగ్రహణం. ఈ ఏడాది ఇది మూడో చంద్రగ్రహణం కాగా చివరిదికూడా. అయితే భారత్‌తో పాటు పలుదేశాల్లో చంద్రగ్రహణం కనిపించదు.ముఖ్యంగా మన దేశంలోని దీని ప్రభావం ఉండదు. కేవలం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికాలోని పశ్చిమ ప్రాంతంలోని ప్రజలకు కనిపిస్తుంది. అంతేకాకుండా గురుపౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడటం వరుసగా ఇది మూడోసారి.

ఉదయం 8.38 గంటలకు ప్రారంభమై ఉదయం 11.21 గంటలకు ముగుస్తుంది. అంతేకాకుడా ఇది ఉపఛాయ చంద్రగ్రహణం. భారత్ లో ఈ గ్రహణం ప్రభావం లేదు కాబట్టి ధార్మిక, మతపరమైన అంశాలకు ఇబ్బంది లేదు.

సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై వచ్చినపుడు.. చంద్రబింభం భూమిపై పూర్తిగా కనిపించకపోయినట్లయితే దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అని అంటారు. పాక్షికంగా కనిపిస్తే దాన్ని పాక్షిక లేదా ఉపఛాయ చంద్రగ్రహణం అని అంటారు. ఈ పాక్షిక చంద్రగ్రహణం అంత ప్రభావం చూపదు.