మొక్కలు నాటిన… 2018 మిస్ తెలంగాణ నిక్షిత రావు

91
gc

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపుమేరకు గ్రీన్ ఛాలెంజ్ 3.0 కార్యక్రమంలో పాల్గొని పలువురికి తాను పలు మొక్కలు నాటారు. అదే స్ఫూర్తితో మరికొంతమందికి చాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే.

ఈక్రమంలో తాజాగా 2018 మిస్ తెలంగాణగా ఎంపిక కాబడిన నిక్షిత రావుకు కూడా ఉప్పల శ్రీనివాస్ గ్రీన్ చాలెంజ్ 3.0 విసిరారు. వెంటనే ఉప్పల శ్రీనివాస్ చాలెంజ్ ను యాక్సెప్ట్ చేసిన నిక్షితరావు తాను మొక్కలు నాటి.. తన స్నేహితులు కూడా ఈ చాలెంజ్ లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ నేటి అశోకుడు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపుమేరకు గ్రీన్ ఛాలెంజ్ 3.0 కార్యక్రమాన్ని చేపట్టిన తనకు మంచి అనుభవాలు ఎదురయ్యాయని, తాను ఛాలెంజ్ చేసిన ప్రతిఒక్కరూ యాక్సెప్ట్ చేస్తూ మొక్కలు నాటడం అలాగే మరికొంతమంది తో మొక్కలు నాటేలా చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న అందుకు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.