- Advertisement -
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 82 వేలకు చేరువయ్యాయి. గత 24గంటల్లో కొత్తగా 592 కరోనా కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,81,414కు చేరాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 6,888 యాక్టివ్ కేసులుండగా 2,73,013 మంది డిశ్చార్జి అయ్యారు. 1513 మంది కరోనాతో మృతిచెందారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా ఉండగా, రికవరీ రేటు 97.01శాతానికి చేరింది. ఇప్పటి వరకు 64,43,052 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- Advertisement -