ఒక్కరోజే 1087 కరోనా కేసులు..

216
coronavirus
- Advertisement -

తెలంగాణలో తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యిదాటాయి. శనివారం ఒక్కరోజే 1,087 మందికి కరోనా పాజిటివ్ రాగా ఆరుగురు మృతిచెందారు. ఒక్కరోజే 3,923 నమూనాలను పరీక్షించగా, 2,836 మందికి నెగెటివ్‌ వచ్చినట్టు వైద్యారోగ్యశాఖ వివరించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్ధారణ పరీక్షలు చేసిన కేసుల సంఖ్య 79,231కి చేరింది.

ఇప్పటివరకు 13436 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇప్పటివరకు కరోనా నుండి కొలుకుని 4928 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక యక్టివ్ కేసుల సంఖ్య 8265గా ఉండగా ఇప్పటివరకు 243 మంది మృతిచెందారు.

ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 888 మందికి కరోనా పాజిటివ్ రాగా రంగారెడ్డి జిల్లాలో 74 కేసులు, మేడ్చల్‌ మల్కాజిగిరి 37, నల్లగొండ 35, సంగారెడ్డి 11, వరంగల్‌ అర్బన్‌ 7, కామారెడ్డి, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ 5 చొప్పున, నాగర్‌కర్నూల్‌, జనగామ 4 చొప్పున, రాజన్నసిరిసిల్ల 3, సిద్దిపేట, భద్రాద్రికొత్తగూడెం 2 చొప్పున, కుమ్రంభీంఆసిఫాబాద్‌, ఖమ్మం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో 1 కేసు చొప్పున నమోదయ్యాయి.

- Advertisement -