రాష్ట్రంలో 24 గంటల్లో 2009 కరోనా కేసులు…

79
Covid-19

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 2,009 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 10 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,95,609 కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 28,320 యాక్టివ్ కేసులుండగా 1,65,844 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58 శాతంగా ఉండగా రికవరీ రేటు 84.78గా ఉంది.

గత 24 గంటల్లో రాష్ట్రంలో 54,098 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా మొత్తం 31,04,542 టెస్టులు పూర్తి చేసినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.