తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 60 వేలు దాటాయి. గత 24 గంటల్లో 1,811 పాజిటివ్ కేసులు నమోదుకాగా 13 మంది మృతిచెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక ఇప్పటివరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 60,717కు చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 15,640 యాక్టివ్ కేసులు ఉండగా 44,542 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు కరోనాతో 505 మంది మృతిచెందారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 4,16,202 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 24 గంటల్లో 18,263 మందికి టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో 521 పాజిటివ్‌లు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 289, మేడ్చల్‌లో 151, వరంగల్ అర్బన్‌లో 102, కరీంనగర్‌లో 97, నల్లగొండలో 61, నిజామాబాద్‌లో 44, మహబూబ్‌నగర్‌లో 41, మహబూబాబాద్‌లో 39 నమోదయ్యాయి.
సూర్యాపేటలో 37, సంగారెడ్డిలో 33, సిరిసిల్లలో 30, గద్వాలలో 28, భద్రాద్రి కొత్తగూడెంలో 27, ఖమ్మంలో 26, సిద్దిపేటలో 24, వనపర్తిలో 23, జనగామలో 22, పెద్దపెల్లిలో 21, భూపాలపల్లిలో 20, వరంగల్ రూరల్‌లో 18 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.