రాష్ట్రంలో 54 వేలు దాటిన కరోనా కేసులు..

172
ap corona cases
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54 వేలు దాటాయి. గత 24 గంటల్లో 1,593 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 8 మంది చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దీంతో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,059కి చేరగా ప్రస్తుతం యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 12,264గా ఉంది. కరోనా నుండి 41,332 మంది కొలుకోగా 463 మంది మృతి చెందారు.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.86 శాతం కాగా జిల్లాల వారీగా చూస్తే జీహెచ్‌ఎంసీ పరిధిలో 640, రంగారెడ్డి జిల్లాలో 171, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 131, మేడ్చల్‌ జిల్లాలో 91, కరీంనగర్‌ జిల్లాలో 51, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 46, ఆదిలాబాద్‌ జిల్లాలో 14, భద్రాద్రిలో 17, జగిత్యాలలో 2, జనగామలో 21 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -