తెలంగాణ కరోనా అప్ డేట్..

120
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 54 వేలు దాటాయి. గత 24 గంటల్లో 1196 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా ఐదుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,53,652కు చేరుకున్నాయి.

ఇప్పటి వరకు 2,34,234 మంది కరోనాబారినపడి రికవరీ కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 18,027 యాక్టివ్ కేసులున్నాయి. 15,205 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా 1390 మంది మృతి చెందారు.

కోవిడ్‌ మరణాల రేటు భారత్‌ వ్యాప్తంగా 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54 శాతంగా ఉంది. రికవరీ రేటు దేశంలో 92.7 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 92.34% శాతానికి పెరిగింది. ఇప్పటివరకు 47,29,401 కరోనా టెస్టులు నిర్వహించారు.

- Advertisement -