24 గంటల్లో 1983 కరోనా కేసులు..

123
covid 19

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 2 వేలు దాటాయి. గత 24గంటల్లో 1983 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 10 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,02,594కు చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 26,644 కరోనా కేసులుండగా 1,74,769 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 1181 మంది మృత్యువాతపడ్డారు.

24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 292, రంగారెడ్డిలో 187, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 145, ఖమ్మంలో 117, కరీంనగర్‌లో 109, నల్లగొండలో 105, భద్రాద్రి కొత్తగూడెంలో 85 కరోనా కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58శాతంగా ఉండగా రికవరీ రేటు 86.26 శాతంగా ఉంది. 24గంటల్లో 50,598 శాంపిల్స్‌ పరీక్షించగా.. మొత్తం 32,92,195 టెస్టులు చేసినట్లు వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.