తగ్గిన బంగారం ధరలు….

167
hyderabad gold rate

బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.530 తగ్గి రూ.52,380కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ.48,020కు చేరింది.

బంగారం ధర పడిపోతే వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర కూడా రూ.510 తగ్గి రూ.60,700కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.06 శాతం తగ్గుదలతో 1918 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.06 శాతం పెరుగుదలతో 24.57 డాలర్లకు చేరింది.