కరోనా …అప్ డేట్స్

289
telangan corona
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 16.97 లక్షలు దాటింది. కరోనా మృతుల సంఖ్య లక్ష దాటగా 209 దేశాలకు విస్తరించింది. ఇప్పటివరకు కరోనా నుంచి 3.76 లక్షల మంది కోలుకున్నారు. ఇక అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటగా ఇప్పటివరకు కరోనాతో 18,699 మంది మృతి చెందారు.

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,412గా నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో కరోనాతో 199 మంది మృతి చెందారు. కరోనా నుంచి 503 మంది బాధితులు కోలుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 487కి చేరింది.ఇప్పటి వరకు కరోనాతో 12 మంది మృతి చెందారు. 45 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 430 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కరోనా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, లాక్‌డౌన్‌పై చర్చించనున్నారు.

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 381కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో ఆరుగురు మృతి చెందారు.కరోనా నుంచి కోలుకుని 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 365 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

- Advertisement -