ఆర్జీవీకి పంచ్ ఇచ్చిన మంత్రి కేటీఆర్..

252
ktr rgv

ట్విట్టర్ వేదికగా #AskKTR అంటూ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆర్జీవీ వేసిన ప్రశ్నకు సరదా సమాధానం ఇచ్చారు కేటీఆర్.

పశ్చిమ బెంగాల్‌లో అక్కడి ప్రభుత్వం మద్యాన్ని డోర్ డెలివరీ చేసేలా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వర్మ.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఓ కోరిక కోరారు.

ఎవరైతే బోర్‌గా ఫీలవుతూ జుట్టు పీక్కుంటున్నారో, చిన్నపిల్లల్లాగా ఏడుస్తున్నారో, మెంటల్ ఆస్పత్రుల్లో చేరుతున్నారో, ఫ్రస్టేషన్‌తో భార్యలను కొడుతున్నారో వీరి కోసం మమతా బెనర్జీ లాంటి పెద్ద మనస్సు ఉండాలి. అలాంటి పద్ధతినే ఇక్కడ కూడా ప్రవేశపెట్టండి అని వర్మ ట్వీట్ చేశారు.

దీనికి సమాధానం ఇచ్చిన కేటీఆర్…రామూ గారూ.. హెయిర్‌ కట్‌ గురించే అడుగుతున్నారు కదా అంటూ చమత్కరించారు. ఆలోచిస్తున్న ఓ ఇమోజీని కూడా జత చేశారు.