- Advertisement -
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1593కి చేరింది. గత 24 గంటల్లో 41 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 26 కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాలకు చెందినవారిలో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక మేడ్చల్ జిల్లాలో ముగ్గురికి కరోనా సోకింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 556 యాక్టివ్ కేసులు ఉండగా సోమవారం 10 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1002కు చేరింది. ఇప్పటి వరకు కరనాబారిన పడి 34 మంది మృతి చెందారు.
- Advertisement -