- Advertisement -
హైదరాబాద్ కాటేదాన్ పరిధిలో చిరుత రోడ్డుపైకి వచ్చి స్ధానిక ప్రజలను భయాందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. చిరుత కోసం అటవీ శాఖ అధికారులు వారం రోజులుగా ముమ్మర గాలింపు చేపట్టారు. అయితే వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న చిరుతపులి ఆచూకీ లభించింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హిమాయత్‌సాగర్ ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్స్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో చిరుతపులి నీళ్లు తాగుతుండగా గమనించిన వాచ్‌మెన్ గమనించారు అధికారులకు సమాచారాన్ని అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కుక్కలను వదిలి చిరుత కోసం గాలిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో బోనుతోపాటు, సీసీ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
- Advertisement -

