మొక్కలు నాటిన చెరసాల చిత్ర యూనిట్…

199
green challenge

చెరసాల చిత్రం షూటింగ్ ప్రారంభం సందర్భంగా ఒక మంచి కార్యక్రమం తో మొదలు పెట్టాలనే ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని చిత్రం యూనిట్ సభ్యులు మొక్కలు నాటి సినిమా షూటింగ్ ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా చిత్రం దర్శకులు రామ్ ప్రకాష్ గుణం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని వాతావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని అందులో భాగంగానే మా సినిమా షూటింగ్ ప్రారంభం సందర్భంగా చిత్ర బృందంతో కలిసి మొక్కలు నాటి సినిమా షూటింగ్ ప్రారంభించడం జరిగిందని.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాది నేని సురేష్, సుధా రామ్, శ్రీజిత్, శిల్పా దాస్ ,నిష్కల తదితరులు పాల్గొన్నారు.