రాష్ట్రంలో 24 గంటల్లో 2072 కరోనా కేసులు..

82
corona

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 2072 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 9 మంది మృతిచెందారు. ఇప్పటివరకు కరోనాతో తెలంగాణలో 1116 మంది మృతిచెందారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు లక్షా 89 వేల 283 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా యాక్టివ్ కేసులు 29,477 ఉన్నాయి. కరోనా మహమ్మారి నుండి 58,690 మంది కరోనా నుండి కోలుకున్నారు. హైదరాబాద్‌లో కొత్తగా 283 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 161,మేడ్చల్ 160 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు టెస్టుల సంఖ్య 30 లక్షలకు చేరువయ్యాయి.