11 మంది ఎమ్మెల్యేలకు కరోనా..

108
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. దేశంలో ఇప్పటివరకు పలువురు కేంద్రమంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు కరోనా బారీన పడగా తాజాగా ఒడిశా రాష్ట్రంలో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజినీకాంత్ సింగ్ తో పాటు 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. వర్షాకాల శాసనసభా సమావేశాలు జరగబోతున్న సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ నిర్ధారణ పరీక్షల్లో 11 మంది ఎమ్మెల్యేలకు, డిప్యూటీ స్పీకర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో వీరిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.