24 గంటల్లో 2479 కరోనా కేసులు…

85
coronavirus

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. 24 గంటల్లో 279 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,642కు చేరుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 31,654 యాక్టివ్ కేసులుండగా 1,15,072 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 916 మంది మృతిచెందారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 322,రంగారెడ్డి జిల్లాలో 188, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 183, వరంగల్‌ అర్బన్‌లో 124, కరీంనగర్‌లో 120, నల్గొండలో 108, నిజామాబాద్‌లో 101 కరోనా కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.62శాతం ఉండగా, దేశంలో 1.69శాతంగా ఉందని చెప్పింది. అలాగే రికవరీ రేటు 77.9శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు 18,90,554 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.