24 గంటల్లో 1802 కరోనా కేసులు…

85
coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1,802 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 9 మంది మృత్యువాతపడ్డారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 1,42,771 కరోనా కేసులు నమోదుకాగా 1,10,241 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,635 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా మహమ్మారితో 895 మంది మృతిచెందగా 24 గంటల్లో 2,771 మంది కోలుకున్నారు.

24 గంటల్లో హెచ్‌ఎంసీలో 245, రంగారెడ్డిలో 158, కరీంనగర్‌ 136, సిద్దిపేటలో 106, సంగారెడ్డిలో 103 మందికి కరోనా సోకిందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.