కరోనా…రెండో స్ధానంలో భారత్‌

219
corona
- Advertisement -

భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకు 90 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతుండటంతో కరోనా కేసుల్లో రెండోస్ధానంలో నిలిచింది భారత్‌.

గత 24 గంటల్లో దేశలో 90,802 పాజిటివ్ కేసులు నమోదుకాగా 1,016 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,04,614కు చేరుకోగా 8,82,52 యాక్టివ్ కేసులున్నాయి.

కరోనాతో ఇప్పటివరకు 71,642 మంది మృతిచెందగా 32,50,429 మంది కరోనా నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో దేశంలో 7,20,362 టెస్టులు చేయగా ఇప్పటి వరకు 4,95,51,507 కరోనా టెస్ట్‌లు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ప్రపంచంలో కరోనా కేసులుతో అమెరికా 64,47,133 కేసులతో అగ్రస్ధానంలో ఉంది.

- Advertisement -