24 గంటల్లో 2,924 కరోనా కేసులు..

157
coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 24 వేలకు చేరవయ్యాయి. గత 24 గంటల్లో 2,924 కేసులు నమోదు కాగా 10 మంది మృతిచెందారు.

దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,23,090కి చేరగా ప్రస్తుతం 31,284 యాక్టివ్ కేసులున్నాయి. 90,988 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

కరోనాతో ఇప్పటివరకు 818 మంది మృతిచెందగా గత 24 గంటల్లో తెలంగాణలో 1,638 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 461 కరోనా కేసులు నమోదయ్యాయి.