మహీ చెప్పిన వినని రైనా..!

196
dhoni

ఐపీఎల్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్‌ కింగ్స్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఓ వైపు కరోనాతో సతమతమవుతున్న సీఎస్‌కేకు రైనా రూపంలో భారీషాక్ తగిలిన సంగతి తెలిసిందే. టోర్నీ నుండి అర్ధాంతరంగా వైదొలిగారు రైనా.

దీంతో రైనా తప్పుకోవడానికి గల కారణాలేంటో ఎవరికి అంతుబట్టలేదు. చివరికి మిస్టర్ కూల్ ధోని చెప్పిన రైనా వినలేదట. కుటుంబంలో విషాదం…మరోవైపు జట్టులో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవడంతో శుక్రవారం రాత్రి భయాందోళనకి గురైన రైనా.. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, హెడ్‌కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఐపీఎల్ 2020 సీజన్ నుంచి తప్పుకుని.. ఇండియాకి వెళ్లిపోతున్నట్లు వారితో రైనా స్పష్టం చేశాడట. కానీ.. రైనా నిర్ణయాన్ని వ్యతిరేకించిన ధోనీ.. అతనికి చాలాసేపు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. లాభం లేకపోయిందట. దీంతో రైనాను జట్టులో ఉంచడం సరైన నిర్ణయం కాదని భావించిన సీఎస్‌కే యాజమాన్యం రైనాను భారత్‌కు పంపే ఏర్పాట్లు చేసిందట.